విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తురబాల గెడ్డ సమీపంలో.. విశాఖ మన్యం ప్రాంతం నుంచి వ్యాన్ లో క్యారెట్ బస్తామ మాటున అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల గంజాయిని గొలుగొండ ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. వ్యాన్ తో పాటు ద్విచ్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురితో పాటు చింతపల్లి మండలానికి చెందిన నలుగురిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. కోటిన్నర వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
Marijuana: క్యారెట్ బస్తాల మాటున కోటిన్నర గంజాయి.. ఏడుగురి అరెస్ట్ - క్రైమ్ వార్తలు
విశాఖ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. సెబ్ అధికారులు పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటిన్నర ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Marijuana