డొంకరాయి జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 40 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేశారు. విశాఖ జిల్లా సీలేరు అటవీ ప్రాంతంలో భారీగా కురిసిన వర్షానికి... మంగళవారం సాయంత్రానికి డొంకరాయి జలాశయానికి భారీగా వరద చేరుకుంది. ప్రాజెక్టు నీటిమట్టం పెరిగిన కారణంగా.. తొలుత 4 గేట్లు ఎత్తి 6వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడుదల చేశారు. మరోసారి.. బుధవారం ఉదయం నుంచి 4 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఏవీపీ డ్యాం నుంచి 2 గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపారు. శబరి పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని... వరద పెరిగితే... మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని ఏపీ జెన్‌కో ఈఈ వి.యల్.రమేష్ తెలిపారు.
డొంకరాయి నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు విడుదల - డొంకరాయి జలాశయం
కుండపోతగా కురుస్తున్న వర్షాలకు... డొంకరాయి జలాశయానికి వరద భారీగా చేరుతోంది. అప్రమత్తమైన ఏపీజెన్కో అధికారులు 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు.
డొంకరాయి నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు విడుదల