ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంకర లోడ్ ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు - vishaka district latest updates

చోడవరం మండలం ఖండేపల్లి గ్రామంలో అక్రమంగా కంకరను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రవికుమార్ హెచ్చరించారు.

నాలుగు కంకర లోడ్ ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు
నాలుగు కంకర లోడ్ ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు

By

Published : Nov 17, 2020, 4:51 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం ఖండేవల్లిలో అక్రమ కంకర తవ్వకాలను రెవెన్యూ సిబ్బంది నిలువరించారు. గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా కంకరను రవాణా చేస్తున్న విషయాన్ని గుర్తించారు.

విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది కంకర లోడ్​తో ఉన్న 4 ట్రాక్టర్లను పట్టుకున్నారు. మండలంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చోడవరం తహసీల్దార్ రవికుమార్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయండి'

ABOUT THE AUTHOR

...view details