మాదకద్రవ్యాల కేసులో విశాఖ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు నరేంద్ర బాబు అలియాస్ విక్కీగా విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. బెంగళూరులో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విక్కీ రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు. విశాఖలో తన స్నేహితురాలు సీత అలియాస్ సిరి ఇంటికి వచ్చిన విక్కీని... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఎండీఎంఏ పౌడర్ సహా ఎల్ఎన్డీ స్వాధీనం చేసుకున్నారు. విక్కీతోపాటు సిరి, వెంకటరావు, చింతలపూడి రాజునూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి గంజాయి ప్యాకెట్లు, మత్తు కలిగించే నిషేదిత మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
డ్రగ్స్ కేసులో విశాఖలో నలుగురు అరెస్ట్: సీపీ ఆర్కే మీనా - drugs news in visakhapatnam
విశాఖలో డ్రగ్స్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు నరేంద్ర బాబు అలియాస్ విక్కీగా తెలిపారు. విక్కీ ..విశాఖ నుంచి గంజాయిని బెంగళూరుకు తరలిస్తూ...అక్కడి నుంచి విశాఖకు, ఇతర నగరాలకు డ్రక్స్ తీసుకొస్తున్నాడని సీపీ మీనా వెల్లడించారు.
rk meena