మృతుల కుటుంబాలకు రూ.35 లక్షల పరిహారం - parawada pharma city latest news
పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్‌సైన్సెస్ ఫార్మా సంస్థలో సోమవారం రాత్రి గ్యాస్ లీకై మృతిచెందిన ఇద్దరు ఉద్యోగుల కుటుంబాలకు రూ.35 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు యాజమాన్యం సమ్మతించింది. ఒక్కొక్కరికి సీఎం సహాయ నిధి కింద రూ.15 లక్షలు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు.
![మృతుల కుటుంబాలకు రూ.35 లక్షల పరిహారం 35 lakh compensation to parawada pharma city deceased families](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7855383-769-7855383-1593654687529.jpg)
విశాఖ పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్‌సైన్సెస్ ఫార్మా సంస్థలో సోమవారం రాత్రి గ్యాస్ లీకై మృతిచెందిన ఇద్దరు ఉద్యోగుల కుటుంబాలకు రూ.35 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు యాజమాన్యం సమ్మతించింది. కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నారు. బీమా సంస్థల నుంచి మృతుల కుటుంబాలకు చెరో రూ.10 లక్షల చొప్పున పరిహారం అందనుంది. ఈ విషయాలను విశాఖ ఆర్డీవో పెంచలకిషోర్ వారి కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి సీఎం సహాయ నిధి కింద రూ.15 లక్షలు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు.