విశాఖ మన్యం కొయ్యూరు మండలంలో 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా చేశారు. పోలీసులు వేధిస్తున్నారంటూ వారు ఆరోపించారు. ఏజెన్సీలోని కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయితీలో మావోయిస్టుల ఆచూకీపై చాలాసార్లు తమను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని 32 మంది గ్రామ వాలంటీర్లు వారి రాజీనామా పత్రాన్ని మండల అభివృద్ధి అధికారి మేరీ రోజాకు సమర్పించారు.
విశాఖ జిల్లాలో 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా - volunteers resign news
విశాఖ జిల్లాలో 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా
15:35 April 06
పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ
వివిధ ప్రభుత్వ పథకాలతో గ్రామాల్లో సేవలు చేస్తుంటే... మావోయిస్టు తనిఖీల పేరుతో పోలీసులు తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక రాజీనామా చేసినట్లు వారు తెలిపారు. పోలీసుల వేధింపులు ఆపితేనే విధుల్లో చేరతామని వాలంటీర్లు తెలిపారు.
ఇదీ చదవండి:
Last Updated : Apr 6, 2021, 5:29 PM IST