ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. ఆరు లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం - విశాఖపట్నంలో గంజాయి పట్టివేత తాజా వార్తలు

సుమారు రూ.6 లక్షల విలువ చేసే 300 కిలోల గంజాయిని విశాఖ జిల్లా రోలుగుంట మండల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ganja seized in visakha news
300కిలోల గంజాయి స్వాధీనం

By

Published : Apr 19, 2021, 8:04 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీ.బీ పట్నం సమీపంలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 300 కిలోల గంజాయిని రోలుగుంట పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన మాసడ అప్పారావు, వడ్డాది కళ్యాణం అనే ఇద్దరు వ్యక్తులు సుమారు 300 కిలోల గంజాయిని ప్యాకెట్ల రూపంలో తయారుచేసి ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. దీనిపై తక్షణమే తమ సిబ్బందితో దాడి చేసి ఇద్దర్ని అరెస్టు చేశామని రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావు వెల్లడించారు.

ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులు పరారయ్యారని.. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. వీరి నుంచి రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.ఆరు లక్షలకు పైగా ఉంటుందని ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details