పాడువా గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఆదివారం రాత్రి కులరసింగి గ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పడవ అదుపు తప్పి మునిగిపోయింది. ఈ ఘటనలో అజయ్ హొంతల్, మనోజ్ హొంతల్ అనే యువకులు ఈదుకుంటూ బయటపడ్డారు. అయితే వీరు ఇద్దరూ భయంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్ప లేదు. ఎక్కడికి వెళ్లారని.. కుటుంబ సభ్యులు వీరిని ప్రశ్నించగా ప్రమాదం సంగతి చెప్పారు. మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి మనోజ్ మృతదేహం దొరికింది. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
జోలపుట్ జలాశయంలో పడవ మునిగి ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు - జోలపుట్ జలాశయంలో వ్యక్తి గల్లంతు తాజా వార్తలు
ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని జోలపుట్ జలాశయంలో పడవ మునిగి ఒకరు మృతి చెందగా ఇద్దరు గల్లంతు అయ్యారు. ఒక యువకుడి మృత దేహం లభించగా.. మరో ఇద్దరికి కోసం గాలిస్తున్నారు.
3 persons drown in jolaput reservior