సింహాచలం అప్పన్న బంగారం అమ్మకం కేసులో నిందితులు హైమావతి, వాసు, నాగేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేశ్ బాబు తెలిపారు. ఇద్దరు దేవస్థాన సిబ్బంది పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు. శ్రావణి అనే బాధిత మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేశామని.. మోసం చేయడానికి గోపాలపట్నంలో ఒక రసీదును డిజైన్ చేశారని డీసీపీ పేర్కొన్నారు. స్టాంపును ద్వారకానగర్‌లో తయారు చేయించారని వివరించారు. నిందితుల నుంచి రూ.2 లక్షలు రికవరీ చేశామన్న డీసీపీ సూళ్లూరుపేటలోనూ ఒక కేసు నమోదు చేశామన్నారు.
సింహాచలం అప్పన్న బంగారం కేసులో ముగ్గురు అరెస్టు - సింహాచలం అప్పన్న స్వామి బంగారం కేసు వార్తలు
సింహాచలం అప్పన్న బంగారం అమ్మకం పేరిట రూ.38 లక్షలు మోసానికి పాల్పడ్డారని విశాఖ క్రైమ్ డీసీపీ సురేశ్ బాబు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.
![సింహాచలం అప్పన్న బంగారం కేసులో ముగ్గురు అరెస్టు 3 persons arrestd in simhadri appanna swamy gold case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8740818-224-8740818-1599657841176.jpg)
3 persons arrestd in simhadri appanna swamy gold case