సీఎం సహాయనిధికి మూడు లక్షల విరాళం - సీఎం సహాయనిధికి మూడు లక్షల విరాళం
కరోనాపై పోరు కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఓ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం 3 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మెుత్తాన్ని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అందజేశారు.
![సీఎం సహాయనిధికి మూడు లక్షల విరాళం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7030581-1104-7030581-1588417028705.jpg)
కరోనా వైరస్ నిర్మూలనకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని... చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. సీఎం సహాయనిధికి స్టోన్ క్రషర్స్ యాజమాన్యం 3 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ చెక్కును ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకు చోడవరం నియోజకవర్గం నుంచి సీఎం సహాయనిధికి 75 లక్షలు సమకూరాయన్నారు. వైరస్ నియంత్రణకు స్వీయ నియంత్రణ అవసరమని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ... భౌతిక దూరాన్ని పాటించి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.