ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీట మునిగిన చెరకు పంట వివరాల సేకరణ - crops loss due to rains in visakha

భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలో నీట మునిగిన చెరకు పంట వివరాలను గోవాడ చక్కెర కర్మాగార వ్యవసాయాధికారులు సేకరిస్తున్నారు. భారీ వర్షాల ధాటికి పంటలన్నీ నీటమునిగిపోతున్నాయని, పలు ఉత్పత్తుల దిగుబడులపై తీవ్ర ప్రభావముంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Sugarcane sink due to rains
నీటమునిగిన చెరకు పంట

By

Published : Oct 13, 2020, 5:25 PM IST

విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చోడవరం చుట్టుపక్కల చెరకు తోటల్లో మూడు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. గోవాడ చక్కెర కర్మాగారం పరిధిలో రెండు వేల హెక్టార్ల పంట నీట మునిగిందని కర్మాగార వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఎంతమేరకు తోటలు మునిగిపోయాయో వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

కర్మాగారం పరిధిలో 12,440 హెక్టార్లలో చెరకు సాగుచేస్తున్నట్లు ప్రధాన వ్యవసాయాధికారి మల్లికార్జునరెడ్డి వెల్లడించారు. వర్షాధార భూముల్లోని తోటలకు ఈ వానలు మేలు చేస్తాయని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details