విశాఖలో రెండో డోస్ టీకా ఇస్తున్నారు. కలెక్టర్ వినయ్‌చంద్ నేతృత్వంలో ఈ టీకా ప్రత్యేక డ్రైవ్ జరుగుతోంది. 39,111 మందికి రెండో డోస్ టీకా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. 160 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఆరోగ్య సిబ్బందికి వైద్య కళాశాలల్లో టీకాలు వేస్తున్నారు. స్వర్ణ భారతి స్టేడియం, కేజీహెచ్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్, రీజినల్ ఐ హాస్పిటల్, టీబీ కంట్రోల్ హాస్పిటల్ లో టీకా కోసం నగర వాసులు బారులు తీరారు. మొదటి డోస్ తీసుకున్న వారు.. రెండో డోస్ కచ్చితంగా తీసుకోవాలని, అందుకే ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టినట్టు అధికారులు చెప్పారు.
విశాఖ నగరంలో రెండో డోస్ వ్యాక్సిన్ - కరోనా వ్యాకినేషన్ వార్తలు
విశాఖ నగరంలో యుద్ధ ప్రాతిపదికన కొవిడ్ టీకా రెండో డోస్ పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
2nd dose vaccination in vishaka