25th International Conference Updates: విశాఖపట్టణం జిల్లా రాడిసన్ బ్లూ హోటల్‌లో ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్‌పై 25వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీ వరకు... మూడు రోజుల పాటు జరగనున్న ఈ 25వ అంతర్జాతీయ సదస్సుకు సుమారు 90 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేరకు మొదటి రోజు సదస్సులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
25th International Conference begins at Visakha: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్..కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్‌పై 25వ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ.. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి సదస్సు విశాఖలో నిర్వహించుకునే అవకాశం ఏపీకి దక్కినందుకు తాను అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
విశాఖలో ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్‌పై 25వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం AMC Centenary Celebrations యజుర్వేణవేదంలో వైద్యం విశిష్టత.. విశాఖ మెడ్‌టెక్ జోన్ నుంచి ప్రపంచానికి పరికరాలు.. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్
CM Jagan Comments: ''వ్యవసాయానికి నీటి కొరత ప్రధాన సమస్య. వర్షాలు కురిసే సమయం బాగా తగ్గిపోయింది. నీటిని ఒక బేసిన్ నుంచి మరోచోటికి ఉపయోగించుకోవాలి. సమస్యలకు సదస్సులో ఆమోదయోగ్య పరిష్కారాలు సూచించాలి. ఏపీలో 40 పెద్ద, మధ్యతరహా, చిన్న నదులు ఉన్నాయి. చాలా శతాబ్దాలుగా వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా ఉంది. సాగు సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేలా, కరవు నేలనూ నీటితో తడిపేలా, తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.'' అని ఆయన అన్నారు.
CM Jagan on Rains:రాష్ట్రంలోనే చాలా పెద్ద ప్రాంతమైన కోస్తా ఉన్నప్పటికీ.. తక్కువ వర్షపాతంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటాయని సీఎం జగన్ పేర్కొన్నారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి అంతర్రాష్ట్ర నదులు ఉన్నా.. పరివాహకంలో దిగువ రాష్ట్రమైనా.. తక్కువ వానలు, వరద విపత్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కరవు సమస్య తీరాలంటే.. ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీళ్లు తరలించే ప్రణాళిక చాలా ముఖ్యమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
Davos Summit: గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపనకు ఏపీ అనుకూలం: సీఎం జగన్
Union Minister Gajendra Singh Shekawat Comments: జలవనరుల సమర్థ వినియోగానికి ఉత్తమ వ్యవసాయ పద్ధతులు అవసరమని..కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. దేశంలో ప్రస్తుతం 250 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉందని ఆయన వెల్లడించారు. సామర్థ్యాన్ని పలు పథకాల ద్వారా పెంచుతున్నామన్నారు. నీటి పునర్ వినియోగానికి ఈ సదస్సు మంచి పరిష్కారాలు సూచించాలని, జల వనరులను కాపాడుకుంటూ కొత్త యాజమాన్య పద్ధతులు కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఒప్పందాలు కుదుర్చుకున్నామని కేంద్ర మంత్రి షెకావత్ వివరించారు.
CM Jagan review meeting: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఒప్పందాలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం...