ఒక్క ఓటు ఆధిక్యంతో 22 ఏళ్ల యువతి సర్పంచ్ పదవిని కైవసం చేసుకుంది. ఈ ఆసక్తికరమైన ఘటన విశాఖ జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెంలో జరిగంది. దిబ్బపాలెం పంచాయతీ సర్పంచి పదవికి... గ్రామానికి చెందిన తుంపాల నిరంజని, నందారపు కాసులమ్మ పోటీ చేశారు.
ఎన్నికల్లో నిరంజనికి 721 ఓట్లు రాగా... ప్రత్యర్థి నందారపు కాసులమ్మకు 720 ఓట్లు వచ్చాయి. 42 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఒక్క ఓటు తేడా రావటంతో అధికారులు పలుమార్లు లెక్కింపు చేపట్టారు. చివరికి అదే మెజారిటీ రావటంతో... తుంపాల నిరంజని సర్పంచిగా గెలుపొందినట్లు ప్రకటించారు.