ముగిసిన 21వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం
విశాఖలో ముగిసిన 21వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం - 21st tribal exchange programme at vishakapatnam
విశాఖలో నిర్వహించిన 21వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ముగిసింది. మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్, రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 200 మంది యువతీయువకులను నెహ్రూ యువ కేంద్రం ద్వారా విశాఖకు తీసుకువచ్చారు. వారికి వారం రోజుల పాటు వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చారు. చదువుకుని కేవలం గ్రామాలకే పరిమితమవుతున్న విద్యార్థుల్లో... సమాజం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
![విశాఖలో ముగిసిన 21వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం 21st tribal exchange programme ends at vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5873462-257-5873462-1580220403598.jpg)
ముగిసిన 21వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం