ఆంధ్ర విశ్వ విద్యాలయంలో కరోనా సమయంలో మార్చి నెల నుంచి తరగతులు సెలవు ప్రకటించారు. సుమారు ఏడు నెలలు తరవాత నవంబర్ 2 నుంచి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఇస్తూ.. కరోనా వ్యాప్తి నివారణ నియమాలు పాటిస్తూ తరగతులు, పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ముందుగా ఆర్ట్స్ కోర్సులను ప్రారంభించారు. కేవలం 21 రోజులు తరగతుల నిర్వహణ, అనంతరం మిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తర్వాత సైన్స్ విద్యార్థులకు డిసెంబర్ ఆరు, ఏడు తేదీల నుంచి తరగతులు మొదలు పెడతారు 21 రోజులు తరగతులు నిర్వహణ తరవాత నెలాఖరులో పరీక్షలు పెట్టి వారిని పంపిస్తారు.
ఈ సమయంలో హాస్టల్లో రూమ్‌కి ఒక్కరిని ఉంచుతారు. పరీక్షల తరవాత విద్యార్థులను ఇంటికి పంపించి ..హాస్టల్ గదులు శానిటైజ్ చేస్తారు. ముందు ఆర్ట్స్ కోర్సులు తరవాత సైన్స్ కోర్సులు. ఇక ఇంజినీరింగ్ కూడా ప్రత్యేక తరగతులు నిర్వహణ ప్రణాళికగా చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు కూడా వీఆర్ క్లాసులను నిర్వహిస్తున్నారు. పరిమిత రోజులు తరగతులు నడుపుతూనే, ముందస్తుగా అన్ని విభాగాల వారికి ఆన్లైన్ తరగతులు కొనసాగుతూ ఉండడం వల్ల పాఠ్య ప్రణాళిక సజావుగా సాగుతోంది అంటున్నారు.
నెలకు 21 రోజులు తరగతులు, సెలవు రోజులు పోగా నాలుగు నుంచి ఐదు రోజులో పరీక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక నడుస్తోంది. ఏ సమయం లో చూసినా.. అటు హాస్టల్లో ఇటు తరగతి గదిలో భౌతిక దూరం పాటిస్తూ ఉండేలా చేసేదే ఈ ప్రణాళిక అంటున్నారు విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి. ఈ సంవత్సరం అడ్మిషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు జనవరి మొదటి వారంలోనే తరగతులు నిర్వహించి పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. తరగతులు నిర్వహిస్తున్న కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య తక్కువగానే ఉందని చెప్పారు.
హాస్టల్ వసతి, విద్యార్థినులకు బస్సు సౌకర్యం, సమన్వయ పరచుకుంటూ పరీక్షలు పూర్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఉపకులపతి వెల్లడించార. రెగ్యులర్, దూర విద్యా, ఇంజినీరింగ్‌తోపాటు అన్ని విభాగాల పరీక్షలు సజావుగా సాగేలా విశ్వవిద్యాలయం ప్రణాళిక విజయవంతం అవుతోందని విశ్వవిద్యాలయ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో మిగతా విశ్వవిద్యాలయాలు కంటే ముందే పరీక్షలు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే డిగ్రీ మూడు సంవత్సరాలు, పీజీ రెండో సంవత్సరం పరీక్షలను పూర్తి చేశారు. ఇక ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలు పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకుంది ఆంధ్ర విద్యాలయం.
ఇదీ చదవండి:15 గంటలు శ్రమించి.. గజరాజును రక్షించి!