ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోలపుట్ జలాశయం నుంచి.. 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల

విశాఖ మన్యంలో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు... సీలేరు కాంప్లెక్స్ పరిధిలో అన్ని జలాశయాలకు వరద భారీగా చేరింది. జోలాపుట్ జలాశయం నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడుదల చేశారు.

జోలపుట్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల

By

Published : Sep 8, 2019, 10:18 PM IST

జోలపుట్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో ఐదు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. జోలాపుట్, బలిమెల, డొంకరాయి జలాశయాలకు వరద నీరు చేరుతోంది. అప్రమత్తమైన ఏపీ జెన్​కో అధికారులు... జోలాపుట్ జలాశయానికి చెందిన 4 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులు, డొంకరాయి జలాశయానికి చెందిన 2 గేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. వరదనీరు పెరిగితే...మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని పర్యవేక్షక ఇంజినీరు సీహెచ్ రామ కోటి లింగేశ్వర రావు తెలిపారు. శబరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details