క్షుద్రపూజలు, గుప్త నిధుల పేరుతో అమాయక మహిళల్ని మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అనంతపురం జిల్లా శింగనమల పోలీసులు అరెస్టు చేశారు. శింగనమలకు చెందిన అన్వర్ భార్య దిల్షాద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో దిల్షాద్ తనకు పరిచయమున్న శ్రీదేవి ద్వారా ఓబులేసు, అశోక్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. వీరిరువురూ దిల్షాద్ ఇంటి వద్ద పూజలు చేసి దుష్టశక్తులను తొలగించి.. ఇంటిలో ఉన్న బంగారం వెలికి తీస్తామని నమ్మించారు. దిల్షాద్ వద్ద నుంచి విడతల వారీగా 10 లక్షలు తీసుకున్నారు. అలాగే శ్రీదేవి వద్ద నుంచి నాలుగు లక్షలు, కొర్రపాడుకు చెందిన రామచంద్రయ్య వద్ద నుంచి మరో నాలుగు లక్షలు తీసుకున్నారు.
గుప్త నిధులన్నారు...పోలీసులకు బుక్కయ్యారు! - పోలీసులు
కష్టపడొద్దు...రాత్రికి రాత్రే...కోటీశ్వరులై పోవాలి. డబ్బుతో జల్సాలు చేయాలి...మూఢ విశ్వాసాలను నమ్మే అమాయకులను మోసం చేయాలి.. ఇదే అనుకున్నారు ఇద్దరు వ్యక్తులు. చివరకు పోలీసుల చేతికి చిక్కారు.
2_persons_cheating_people_with_superstitions
ఇలా ఈ తంతు కొన్ని రోజులు సాగింది. బాధితులకు అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో నిందితులు పరారయ్యారు. బాధితులు విషయాన్ని శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు లోలూరు క్రాస్ వద్ద ఓబులేసు, అశోక్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.