కరోనా వైరస్ లక్షణాల అనుమానంతో విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఓ యువకుడు చికిత్స పొందుతున్నాడు. సింగపూర్‌లో వెల్డర్‌గా పని చేసే అతను.. గత నెల 29న భారత్‌కు వచ్చాడు. ఎయిర్ పోర్ట్‌లో పరీక్ష చేయగా కరోనా లక్షణాలు లేవని తేలింది. ఇటీవల జ్వరం, జలుబు రాగా.. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు. కరోనా లక్షణాల అనుమానంతో ఇతన్ని అనకాపల్లి ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి.. ఇటలీలో చదువుకుంటూ ఇటీవలే అనకాపల్లి వచ్చాడు. ఇతనికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో విశాఖపట్నంలోని టీబీ ఆసుపత్రిలో అధికారులు చికిత్స అందిస్తున్నారు.
విశాఖ జిల్లాలో ఇద్దరు వ్యక్తులకు కరోనా లక్షణాలు - latest karona news in andhrapradesh
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాష్ట్రాన్ని తాకుతోంది. ఇప్పటికే నెల్లూరులో ఒక కేసు నమోదు కాగా.. ఇప్పుడు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కరోనా వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తి