విశాఖ జిల్లా చోడవరం మండలంలో188 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గజపతినగరం కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ టాటా ఇండియా కారులో 188 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయితో పాటు కారును సీజ్ చేసి ఒకర్ని అరెస్ట్ చేసినట్లు ఎస్సై విభూషిణిరావు తెలిపారు. గిరిజన ప్రాంతం నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
చోడవరంలో 188 కిలోల గంజాయి పట్టివేత - vishaka district latest news
విశాఖ జిల్లా చోడవరంలో 188 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కారును సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై విభూషిణిరావు తెలిపారు.
చోడవరంలో 188 కిలోల గంజాయి పట్టివేత