కరోనా వ్యాప్తి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి నడిచి వస్తున్న 15 మంది గిరిజనులను నర్సీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతానికి చెందిన సుమారు 15 మంది గిరిజనులు.. కాకినాడ పరిధిలోని ఓడరేవుల్లో ఉపాధి నిమిత్తం ఈ నెల 5, 6 తేదీల్లో వెళ్లారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడ పనులు నిలిపివేశారు. వీరందరూ కాకినాడ నుంచి తుని వరకు ఆటోలలో ప్రయాణించారు. తుని నుంచి కాలినడకన సుమారు 30 కిలోమీటర్లు నడిచిన తర్వాత పాములవాక సమీపంలో పోలీసులు పట్టుకుని ప్రశ్నించారు. వీరిని ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షిస్తున్నామని.. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి తెలిపారు.
30 కిలోమీటర్లు నడిచారు... పోలీసులకు చిక్కారు - latest news on lock down
తూర్పుగోదావరి జిల్లా నుంచి నడిచి వస్తున్న 15 మంది గిరిజనులను నర్సీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. వీరిని ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
![30 కిలోమీటర్లు నడిచారు... పోలీసులకు చిక్కారు 15 tribal s caught in narsipatnam while going to home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6571351-69-6571351-1585385345809.jpg)
15 గిరిజనులను పట్టుకున్న పోలీసులు