ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

15లక్షల విలువైన గంజాయి పట్టివేత - Cannabi News in Kottalapalli

విశాఖ జిల్లా ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన కొట్టాలపల్లిలో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఊక బస్తాలతో వెళ్తున్న వ్యానుపై అనుమానం వచ్చిన అధికారులు పరిశీలించగా గంజాయి బయటపడింది. దాదాపు 15 లక్షల విలువ గల 646 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

15లక్షల విలువైన గంజాయి పట్టివేత
15లక్షల విలువైన గంజాయి పట్టివేత

By

Published : Mar 22, 2020, 6:46 AM IST

విశాఖ జిల్లా ఒరిస్సా సరిహద్దు కొట్టాలపల్లిలో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నిర్వహించిన దాడిలో... దాదాపు 15లక్షల విలువ గల 646కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఊక బస్తాలతో వెళ్తున్న వ్యానుపై అనుమానం వచ్చిన అధికారులు పరిశీలించగా అందులో గంజాయి బయటపడింది. వాహనాన్ని సీజ్ చేసి ఎస్‌.కోట అబ్కారీ సర్కిల్ కార్యలయానికి తరలించారు. కొలకత్తా, చైన్నై లాంటి సుదూర ప్రాంతాలకు గంజాయి తరలించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారని డిప్యూటీ కమిషనర్ భాస్కర్ రావు తెలిపారు. గంజాయిని పట్టుకున్న సిబ్బందిని అభినందించి, ప్రోత్సాహకాలకు సిఫార్సు చేసినట్లు వివరించారు. నిందితుడిని విజయనగరం కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లిడించారు.

15లక్షల విలువైన గంజాయి పట్టివేత

ఇదీ చూడండి:గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details