విశాఖ సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవం సందర్భంగా స్వామివారికి 15 లక్షల ఆదాయం సమకూరింది. చందన విరాళాలు, పరోక్ష పూజల నిర్వహణ ద్వారా రూ.15,45,630 ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. చందనం సమర్పణకు విరాళాలిచ్చిన భక్తులకు రెండు రోజుల్లో చందనం చెక్కలను పోస్టు ద్వారా పంపే ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
కిలో చందన సమర్పణకు విరాళాలు పంపిన భక్తులకు చందనం చెక్కతో పాటు స్వామి వారి చందనం శేషవస్త్రం కూడా పంపిస్తామని అన్నారు. తదుపరి విడతల్లో జరగనున్న చందన సమర్పణకు విరాళాల స్వీకరణ కొనసాగుతోందని తెలియజేశారు. గత ఏడాది చందనోత్సవం ఏకాంతంగా జరిగిన … 28 లక్షల ఆదాయం వచ్చిందని.. ఈ సంవత్సరం ఆదాయం తగ్గిందని తెలిపారు.