పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తుండగా జీపు బోల్తా పడిన ఘటనలో 15 మందికి గాయలయ్యాయి. విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురంలో ఓటు వేసేందుకు ఉబ్బెడ గ్రామం నుంచి 20 మంది లక్ష్మీపురానికి బయల్దేరారు.
మలుపు వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రిని తరలించారు. వీరిలో తీవ్రంగా ఐదుగురిని పాడేరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జీపు ప్రమాదం జరగటంతో తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయామని క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.