విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలోని వెంకటేశ్వరుని ఆలయంలో కల్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏకాదశి పురస్క రించుకుని కల్యాణాన్ని కనులారా తిలకించేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి స్వామిని దర్శించుకునేందకు భక్తులు భారీగా తరలి వచ్చారు.కల్యాణం సందర్భంగా బుధవారం రాత్రి దొంగపెళ్లి జరిపారు. ధ్వజస్తంభానికి 200 కిలోల ఇత్తడితో తయారు చేసిన తొడుగులు వేశారు. స్వామి కొండకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా.. దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
వెంకన్నకు దొంగపెళ్లి..! ఎక్కడో తెలుసా? - విశాఖలో వెంకటేశ్వర స్వామి కల్యాణం
విశాఖ జిల్లా వడ్డాదిలోని వెంకటేశ్వరుని 147వ కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏకాదశి కావటంతో స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
వెంకన్న స్వామి 147వ కల్యాణ మహోత్సవం.. చూద్దాం రారండి