విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. గురువారం ప్రకటించిన కోవిడ్ పరీక్షలలో 14 మందికి పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఒకేసారి 14 మందికి పాజిటివ్ రావటంతో గ్రామస్థులంతా భయందోళనలో ఉన్నారు. వీరిలో ముగ్గురు బుచ్చెయ్యపేట మండల వాసులు. మిగిలిన 11 మంది చోడవరం పట్టణవాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బుచ్చెయ్యపేట మండలంలో రాజాం గ్రామంలో ఒకే కుటుంబంలోని తల్లికి తన అయిదేళ్ల కూతురుకు కరోనా సోకింది.
చోడవరం నియోజకవర్గంలో ఒక్క రోజే 14 మందికి కరోనా - covid-19 cases in chodavaram vishakapatanam
చోడవరం నియోజకవర్గంలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. గురువారం ఒక్కరోజే 14 మందికి పాజిటివ్ నిర్ధారించడమైనదని అధికారులు తెలియచేశారు.
చోడవరం నియోజకవర్గంలో ఒక్క రోజే 14 పాజిటివ్ కేసులు