ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఊళ్లో మహిళ గర్భవతి అయితే చాలు.. ఊరొదిలి వెళ్తున్న దంపతులు..! - ap 2021 news

పసిపాపల బోసి నవ్వుల కోసం పెళ్లైన ప్రతి జంట ఎంతగానో పరితపిస్తుంది. కడుపులో నలుసు పడగానే ఆ దంపతుల ఆనందానికి హద్దే ఉండదు. పండంటి బిడ్డ కోసం ఎన్నో జాగ్రత్తలు, మరెన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అయితే.. విశాఖ మన్యంలోని ఓ గ్రామంలో మాత్రం.. బిడ్డ కడుపున పడిన విషయం తెలిస్తే చాలు.. గ్రామాన్ని వదిలి దూరంగా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.

14-childrens-died-in-only-tow-years-at-vishaka-manyam
మన్యంలో శిశుమరణాలు.. ఊరొదిలి వెళ్తున్న తల్లిదండ్రులు..!

By

Published : Nov 12, 2021, 11:17 AM IST

Updated : Nov 12, 2021, 1:17 PM IST

వారం వ్యవధిలో ఇద్దరు చిన్నారులు.. ఆరు నెలల కాలంలో 8 మంది పసివాళ్లు, రెండేళ్లలో 14 మంది శిశువులు.. విశాఖ మన్యంలోని పాత రూఢకోటలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య ఇది. గిరిజనులుండే ఈ పల్లెలో చోటు చేసుకుంటున్న శిశుమరణాలు.. స్థానికుల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పసిపిల్లలు కళ్లెదుటే గిలగిలా కొట్టుకుని చచ్చిపోతున్నారని.. తమ గ్రామానికి ఏదో జరిగిందని అమాయకపు ఆదివాసులు వణికిపోతున్నారు.

మన్యంలో శిశుమరణాలు.. ఊరొదిలి వెళ్తున్న తల్లిదండ్రులు..!

నవ మాసాలు కడుపున మోసి కన్న పిల్లల ఎదుగుదల చూద్దామనే ఆశ తీరక ఆ గ్రామ మహిళలు.. మానసికంగా కుంగిపోతున్నారు. చిన్నారులను బలి తీసుకుంటున్న గ్రామంలో ఎందుకు ఉన్నామంటూ ఆవేదన చెందుతున్నారు. అంతు చిక్కని శిశుమరణాలతో భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి గ్రామం విడిచి వెళ్తున్నారు.

కడుపు నొప్పి, వాంతులు, ఊపిరి సమస్యతో చిన్నారులు మృత్యువాత పడుతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలో బాగానే ఉండేదని, రెండేళ్లుగా శిశుమరణాలు నమోదవుతున్నాయని వాపోతున్నారు. స్కానింగ్, ఇతర వైద్య పరీక్ష ఫలితాలు సాధారణంగానే ఉన్నా పసివాళ్లు మృతి చెందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూఢకోట ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ మాత్రం చిన్నారుల మరణాలకు నాటు వైద్యం, పాలు సమయానికి ఇవ్వకపోవడం వంటి అంశాలు కారణం కావొచ్చని అంటున్నారు.

ఇదీ చూడండి:FARMERS MAHA PADAYATRA: ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. రెట్టింపు ఉత్సాహంతో..

Last Updated : Nov 12, 2021, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details