ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొలుగొండలో 125 కిలోల గంజాయి పట్టివేత - విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు.

గొలుగొండ మండలంలో 125 కిలోల గంజాయి పట్టివేత
గొలుగొండ మండలంలో 125 కిలోల గంజాయి పట్టివేత

By

Published : Mar 17, 2021, 12:35 PM IST

విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి, నర్సీపట్నం మార్గంలో.. ఓకారులో తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు గొలుగొండ ఎస్సై ధనుంజయ నాయుడు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులు గంజాయి ఎక్కడ కొనుగోలు చేశారు? ఎవరు అమ్మకాలు చేశారో అనే దానిపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: పైసా ఖర్చులేకుండా.. గోనె సంచులతో పంటకు రక్షణ!

ABOUT THE AUTHOR

...view details