ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి అమ్ముతున్న ఆరుగురు విద్యార్థుల అరెస్ట్​ - గుంటూరు జిల్లా వార్తలు

విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 1200 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న విద్యార్థులను అరెస్ట్​ చేశారు.

ganja caught at visakapatnam district
గంజాయి పట్టివేత

By

Published : Apr 26, 2021, 8:47 PM IST

విశాఖ జిల్లాలో...

విశాఖ జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయరహదారిపై పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ లారీలో తరలిస్తున్న సుమారు 1200 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొత్తపేట సర్కిల్​కు చెందిన శ్రీనివాసరావు అనే కానిస్టేబుల్​తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లా కొలనుకొండలోని ఓ అపార్టుమెంట్‌పై పోలీసుల దాడి నిర్వహించారు. ఆక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు విద్యార్థులను అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 1.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

అడవిని వీడి హోటల్​కు వచ్చిన చిరుతలు!

పర్యాటక ప్రాంతాల్లో కనిపించని జనం

ABOUT THE AUTHOR

...view details