విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు లారీలలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన 1200 కిలోల గంజాయి విలువ సుమారు కోటి రూపాయలకు పైగా ఉంటుందని కృష్ణదేవిపేట ఎస్ఐ సిహెచ్ భీమరాజు తెలిపారు. విశాఖ మన్యం నుంచి బయలుదేరిన ఈ వాహనాలను ముందస్తు సమాచారం మేరకు మాటు వేసి పట్టుకున్నామని పోలీసులు వివరించారు. గంజాయి తరలించడానికి ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్నారు.
1200 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు - vishaka district
విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీసులు 1200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

1200 కిలోల గంజాయి స్లాధీనం.. ఇద్దరు అరెస్టు
TAGGED:
vishaka district