PM TOUR IN VISAKHA : ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11, 12వ తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. 10,472 కోట్ల రూపాయల విలువైన ఏడు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ విజయసాయి రెడ్డి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, తదితర అధికారులు పరిశీలించారు.
ఈనెల 11న విశాఖకు ప్రధాని.. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు - విశాఖలో మోదీ పర్యటన
PM MODI TOUR IN VISAKHA : ప్రధాని మోదీ ఈనెల 11, 12వ తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 10వేల 472కోట్ల రూపాయల విలువైన ఏడు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
PM MODI TOUR
ప్రధానమంత్రి విశాఖపట్నం పర్యటన ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదని,.. కేవలం ప్రభుత్వ కార్యక్రమమని ఎంపీ విజయసాయి రెడ్డి వివరించారు. విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, గెయిల్ పైప్లైన్, రాయపూర్ నుంచి విశాఖపట్నం ఆరు వరుసల రహదారి, ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ.. తదితర ఏడు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు.
ఇవీ చదవండి: