110 కిలోల గంజాయి పట్టివేత - Cannabis seized news in cheedipalem
విశాఖ మన్యం నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
110 కిలోల గంజాయి పట్టివేత
విశాఖ మన్యం నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు మండలం చీడిపాలెం సమీపంలో స్థానిక ఎస్ఐ నాగేంద్ర వాహనాల తనిఖీ చేపట్టారు. దాడుల్లో రెండు కార్లలో 110 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. అనంతరం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారినుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.