విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం 11 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో పట్టణ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఉన్నారు. గుండాల కూడలి, విల్లూరి జోగినాయుడు వీధి, గవరపాలెం, నర్సింగరావుపేట ప్రాంతాల్లో కరోనా బాధితులు ఉన్నారు. పట్టణంలో ఒకరు మృతి చెందారని... కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ భాస్కరరావు, ఎస్సై రామకృష్ణ ప్రచారం చేశారు.
అనకాపల్లిలో 11 కరోనా కేసులు నమోదు
అనకాపల్లిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గవరపాలెంలో ఏడాది చిన్నారికి కరోనా వచ్చింది. శుక్రవారం చిన్నారితో కలిపి మొత్తం 11 మందికి కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ భాస్కరరావు, ఎస్సై రామకృష్ణ ప్రచారం