సాల్మన్ రాజ్, నర్సీపట్నం బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రేపటి నుంచి జరిగే పదోతరగతి పరీక్షలకు విశాఖ జిల్లాలో పూర్తి ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలలో వెలుతురు, తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 56 వేల 683 మంది పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని... వీరికోసం 242 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
ఇవీ కూడా చదవండి....