Visakha Railway zone: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయ భవన నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభమవుతాయని వాల్తేర్ డిఆర్ఎం అనూప్ కుమార్ సతపతి వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే గుర్తించిన స్ధలాన్నిరైల్వే మంత్రి సహా ఉన్నతాధికార్లు పరిశీలించారని వివరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రానున్న కొద్ది నెలల్లో టెండర్ ప్రక్రియ ఆరంభమవుతుందని దీనికి ఇప్పటికే 106కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ పునర్ అభివృద్దికి ప్రధాన మంత్రి శంకుస్దాపన చేసిన పనుల పై వివరణ ఇస్తూ, దేశంలోనే అత్యాధునిక స్టేషన్ల సరసన విశాఖ ఈ పనులతో చేరుతుందన్నారు. మొత్తం 36 ఎస్కలేటర్లు, బహుళ అంతస్ధుల భవనాలతో దీనికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని పనులు అరంభమవుతున్నాయన్నారు. ఆదనంగా 2 ఫ్లాట్ ఫాంలు వచ్చేందుకు కూడా ప్రతిపాదనలు కార్యరూపం దాలుస్తున్నట్టు వివరించారు.
విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయ నిర్మాణానికి 106కోట్ల నిధులు - రైల్వే జోన్ విశాఖ
Visakha Railway zone: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయ భవన నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభమవుతాయని వాల్తేర్ డీఆర్ఎం అనూప్ కుమార్ సతపతి వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే గుర్తించిన స్ధలాన్నిరైల్వే మంత్రి సహా ఉన్నతాధికార్లు పరిశీలించారని వివరించారు. దీనికి ఇప్పటికే 106కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
వాల్తేర్ డీఆర్ఎం అనూప్ కుమార్ సతపతి