ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో 104 ఫార్మసిస్ట్ ఉద్యోగుల ఆందోళన - vishakapatnam latest news

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో 104 ఫార్మసిస్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖలో 104 ఫార్మాసిస్ట్ ఉద్యోగుల ఆందోళన
విశాఖలో 104 ఫార్మాసిస్ట్ ఉద్యోగుల ఆందోళన

By

Published : Nov 5, 2020, 7:51 PM IST

విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో 104 ఫార్మసిస్ట్​ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈఏడాది జూలై 1న ప్రవేశ పెట్టిన నూతన వాహనాల్లో ఫార్మసిస్టులను మినహా మిగితా అందరిని విధుల్లోకి తీసుకున్నారని చెప్పారు.

తమకు సైతం ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 నెలలుగా పని లేక రోడ్ల పాలైన తమ కుటుంబాల ఆవేదనను అర్ధం చేసుకుని.. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

'జగనన్న పచ్చతోరణాన్ని విజయవంతం చేయండి'

ABOUT THE AUTHOR

...view details