1000వ రోజు విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన - రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, ప్రజాసంఘాల మద్దతు 1000day of Visakha Steel Plant Employees Agitation: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని కార్మికులు 1000వ రోజు ఉద్ధృతంగా ఆందోళనలు కొనసాగించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద వామపక్షాలు, అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఐకాస ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ.. కూర్మన్నపాలెం కూడలి వద్ద ఆందోళన చేశారు. వాహనాలకు అడ్డుగా నిలబడి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వారికి వివిధ రాజకీయ, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
రహదారిపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద రిలే నిరాహార దీక్షా శిబిరం కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగింది. కార్మికులతో పాటు, కార్మికుల కుటుంబ సభ్యులు, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు దీక్షలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నవంబరు 26 నుంచి 28 వరకు 72 గంటల పాటు ధర్నా నిర్వహిస్తామని కార్మిక నేతలు తెలిపారు.
విశాఖ ఉక్కు పోరాటానికి వెయ్యి రోజులు - ప్రభుత్వ స్పందన లేకపోవడంపై మండిపడుతున్న కార్మిక సంఘాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద కార్మికులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు చేస్తున్న నిరసనలకు తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. కేంద్రంతో కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ యత్నిస్తున్నారని నేతలు మండిపడ్డారు. అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లే వరకు ఉక్కు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో విజయవాడలో కార్మికులు ధర్నా చేశారు. వీరికి టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు పరిశ్రమను జగన్.. కార్పొరేట్‌లకు అప్పగించేందుకు సహకరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
State Bandh for Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, కడప ఉక్కు పరిశ్రమ సాధనకు నవంబర్ 8న బంద్
"అఖిల పక్షాలతో కమిటీ ఏర్పాటు చేసి.. సమస్యను ప్రధాని వద్దకు తీసుకెళ్లాలి. అవసరమైతే ప్రధానమంత్రికి అల్టిమేటం ఇచ్చే స్థాయిలో అధికార పార్టీ ఉండాలి. కానీ, దురదృష్టవశాత్తు ఇక్కడి అధికార పార్టీ.. దిల్లీలో మోదీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తుతోంది." -గంటా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత
"జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళ్తొంది. ఈ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడగలం. జగన్మోహన్ రెడ్డి కపట నాటకం, రాక్షస నాటకం తప్పకుండా బయటపెడ్తాం."-జనసేన నేత
Vishaka Ukku Rakshana Yatra: విశాఖలో ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం.. మొదలైన 'ఉక్కు రక్షణ యాత్ర'
Student Unions Agitation On Visakha Steel Plant Issueవిద్యార్థి సంఘాల ఆందోళన:విశాఖ ఉక్కును కాపాడుకుంటామని విద్యార్థి సంఘాలు తేల్చి చెప్పాయి. రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా.. విజయనగరం జిల్లా కోట వద్ద నిరసన తెలిపారు. నెల్లూరులోనూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేశారు. విద్యార్థులను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అనంతపురంలోనూ ధర్నాలు జరిగాయి. సీఎం జగన్ రాష్ట్రానికి నూతన పరిశ్రమలను తీసుకురాకపోగా.. ఉన్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు సహకరించటం దారుణమని విద్యార్థి నేతలు మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడి కడపలోనూ పరిశ్రమ ఏర్పాటు చేసేలా కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలులో విద్యార్థి సంఘాలతో కలిసి బంద్‌లో పాల్గొన్న ఆయన.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
Student Union Protest on Visakha Ukku in Nellore : విశాఖ స్టీల్ పరిరక్షణ, కడప ఉక్కు పరిశ్రమ సాధనకై... నవంబర్ 8న రాష్ట్ర బంద్
"విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాకుడదని జరుగుతున్న పోరాటానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అండగా నిలుస్తున్నాయి. విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. అవసరమైతే నరేంద్ర మోదీని గద్దె దించుతాం." -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
విశాఖ ఉక్కుకు తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేత నారా లోకేశ్ ప్రకటించారు. జగన్ వల్లే పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం యత్నిస్తోందన్నారు. ఉక్కు పోరాటం వెయ్యి రోజుల సందర్భంగా కార్మికులకు ఉద్యమాభివందనాలు తెలిపారు.
Steel Plant: విశాఖ ఉక్కు కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు