గుంటూరు జిల్లా యడ్లపాడు మండల విద్యాశాఖ అధికారి పిల్లి డేవిడ్ రత్న (60) కరోనాతో మృతి చెందారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించారు. రానున్న ఆగస్టులో పదవీ విరమణ చేయనున్న సమయంలో ఆయన మృతి చెందడం అందరిని కలిచి వేసింది. ఎంఈఓ మృతికి ఎమ్మెల్యే విడదల రజిని, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తదితరులు సంతాపం తెలిపారు.
గత నెలలో పాఠశాలలు జరిగిన సమయంలో మండలంలోని అన్ని పాఠశాలల హెచ్ ఎం లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎంఈఓకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు మొదట నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ తిరగబెట్టి పాజిటివ్ వచ్చింది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో గుంటూరు జీజీ హెచ్ లో చేరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.