ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధుల్లోనే వీఆర్​ఏ మృతి... కుటుంబ సభ్యుల ధర్నా - వీఆర్​ఏ

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వీఆర్ఏ నారాయణస్వామి విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురై మృతిచెందాడు. పని ఒత్తిడితోనే నారాయణస్వామి చనిపోయాడంటూ వీఆర్ఏలు, వీఆర్వోలు మృతుని కుటుంబ సభ్యులతో కలిసి  ఆందోళన చేపట్టారు.

విధులు నిర్వర్తిస్తూ వీఆర్​ఏ మృతి.. కుటుంబసభ్యల ధర్నా

By

Published : Apr 10, 2019, 9:52 AM IST


అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వీఆర్ఏ నారాయణస్వామి విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురై మృతి చెందారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు తాహశీల్దార్ కార్యాలయంలో విధులు ముగించుకొని.... స్వగ్రామానికి వెళ్లి పోలింగ్ బూతుల వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేస్తుండగా ఉన్నట్లుండి కిందపడ్డారు. గమనించిన స్థానికులు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహంతో తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పని ఒత్తిడితోనే నారాయణస్వామి చనిపోయాడంటూ మృతుని కుటుంబ సభ్యులతో కలిసి వీఆర్ఏలు, వీఆర్వోలుఆందోళన చేపట్టారు. న్యాయం చేసేంతవరకు ధర్నా విరమించేదిలేదని స్పష్టంచేశారు. స్పందించిన ఏఆర్ఓ వెంకటరెడ్డి... మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతోపాటు రూ.1.50 లక్షలు ఇస్తామని చెప్పగా ధర్నా విరమించారు.

విధులు నిర్వర్తిస్తూ వీఆర్​ఏ మృతి.. కుటుంబసభ్యలు ధర్నా

ABOUT THE AUTHOR

...view details