ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఓ అభ్యర్థిని కన్నీటి పర్యంతమైంది. అగ్రికల్చరల్ విభాగంలో గిద్దలూరుకు చెందిన ఎన్. కామేశ్వరి అనే యువతి నియామక పత్రాల పంపిణీలో తమ పేరు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు వద్ద పన్నీటి పర్యంతమైంది. తాను ధ్రువ పత్రాల పరిశీలనకు కూడా వెళ్లానని కానీ ఇక్కడ తమ పేరు రాకపోవటమేమిటో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు చొరవ తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది.
'ధ్రువపత్రాలు పరిశీలించారు... నియామక జాబితాలో పేరు మరిచారు' - 'ధ్రువ పత్రాల పరిశీలన పూర్తైంది కానీ...నియామక పత్రం ఇవ్వటం లేదు'
ప్రకాశం జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాల అందజేతలో గందరగోళం నెలకొంది. ధ్రువ పత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న ఓ అభ్యర్థిపేరు నియమాక పత్రాల జాబితాలో లేకపోవటంతో సదరు అభ్యర్థి కన్నీటి పర్యంతమైంది. స్థానిక ఎమ్మెల్యే వద్ద తన గోడును వెల్లబోసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది.
!['ధ్రువపత్రాలు పరిశీలించారు... నియామక జాబితాలో పేరు మరిచారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4604328-613-4604328-1569851390876.jpg)
అభ్యర్థిని ఆవేదన
Last Updated : Oct 1, 2019, 7:08 AM IST
TAGGED:
grama cachivalaya