ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నామని చిరంజీవి చెప్పారు. ముఖ్యమంత్రిని ఇవాళ కలిసి తమ సంతోషాన్ని తెలియజేశామన్నారు. 2019-20 నంది పురస్కారాల ప్రదానానికి సీఎం నిర్ణయించారని చెప్పారు. సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. త్వరలోనే సినిమాల చిత్రీకరణకు సీఎం అంగీకరించినట్టు చెప్పారు. తాము అడిగిన అన్ని విషయాలకూ సీఎం సానుకూలంగా స్పందించినట్టు సంతోషం వ్యక్తం చేశారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పినట్టు తెలిపారు. టికెట్ల విధానంలో పారదర్శకతకు చర్యలు తీసుకుంటానని చెప్పారన్నారు.
త్వరలోనే షూటింగులు.. సీఎం అంగీకారం: చిరంజీవి - సీఎం జగన్‌తో సమావేశం
![త్వరలోనే షూటింగులు.. సీఎం అంగీకారం: చిరంజీవి tollywood celebrities met cm ys jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7542710-878-7542710-1591699375947.jpg)
16:04 June 09
త్వరలోనే షూటింగులు.. సీఎం అంగీకారం: చిరంజీవి
15:18 June 09
క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సినీ ప్రముఖులు.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సినీ రంగ సమస్యలు, పరిష్కారంపై చర్చిస్తున్నారు.
15:17 June 09
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి సినీ ప్రముఖులు చేరుకున్నారు. చిరంజీవి నేతృత్వంలో సీఎంను నటులు దర్శకులు, నిర్మాతలు కలిశారు. నాగార్జున, రాజమౌళి, సి.కల్యాణ్, సురేశ్‌బాబు, దిల్ రాజు, నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై చర్చించనున్నారు.