జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. ఆదివారం వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరుల దాడి ఘటనలో... గాయపడిన జనసేన నాయకులు, కార్యకర్తల్ని పవన్ పరామర్శిస్తారు. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్న జనసేనాని... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ వద్ద ఉన్న హెల్కొన్ టైమ్స్‌కు చేరుకొంటారు. అనంతరం జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ ఇంటికి వచ్చి పరామర్శిస్తారు.
నేడు కాకినాడకు పవన్..జనసైనికులకు పరామర్శ - కాకినాడలో వైకాపా- జనసేన వర్గీయుల దాడి వార్తలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. వైకాపా-జనసేన వర్గీయుల మధ్య జరిగిన దాడిలో గాయపడిన ఆ పార్టీ నేతలను పరామర్శించనున్నారు.
![నేడు కాకినాడకు పవన్..జనసైనికులకు పరామర్శ today-pawankalyan-tour-of-kakinada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5702231-833-5702231-1578949962392.jpg)
today-pawankalyan-tour-of-kakinada
ఇదీ చదవండి : సంక్రాంతి సంబరాలు: నేడు గుడివాడలో పాల్గొననున్న సీఎం