ఇరవై రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సందర్భంగా సోమందేపల్లిలోని గ్రామ ప్రజలు ఎవరూ బయటకు రావటం లేదు. గ్రామంలోని కోతులకు ఎటువంటి ఆహారం అందక తల్లడిల్లిపోతున్నాయి. వాటి బాధను చూసిన సోమందేపల్లి స్టేషన్ ఎస్సై ,సిబ్బంది పదిహేను వందల అరటిపళ్లను తెచ్చి మూగజీవాలకు అందించారు. ఆహారం లభించక ఒక కోతిని మిగతా కోతులు పీక్కు తినడం చూసి మనసు చలించిపోయింది అని ఎస్సై వెంకటరమణ అన్నారు. అందుకే మూగజీవాలను కోతులకు ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని ప్రజలు కూడా ఎక్కడైనా మూగజీవాల కనపడితే వాటికి ఆహారం అందించి వాటి మనుగడకు కృషి చేయాలని ఎస్సై కోరారు.
వానరాల ఆకలి బాధ తీర్చిన పోలీసులు - వానరాల ఆకలిబాధ తీర్చిన పోలీసులు
రోడ్లపై తిరిగే వారు ఇచ్చే పదో పరకో యాచకుల కడుపు నింపుతుంది. పాడై పారేసే పళ్ళు నోరులేని మూగజీవులకు ఆహారం అవుతుంది. అలాంటిది రోడ్లపైకి జనాలు రావడమే బందైంది. ఒకవేళ రోడ్డెక్కినా... వచ్చామా పనిచూసుకున్నామా అన్నట్లు మారింది ప్రస్తుత పరిస్థితి. ఇలాంటి దయనీయ స్థితిలో మూగజీవeలను పట్టించుకునే వారే కరవయ్యారు. వాటి ఆకలి బాధను తీర్చే నాథుడు లేడనే చెప్పాలి. అనంతపురం జిల్లా సోమేందుపల్లిలో పోలీసులు 1500 అరటిపళ్లను కోతులకు ఆహరంగా అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
వానరాల ఆకలిబాధ తీర్చిన పోలీసులు