ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెదకూరపాడు రైల్వేస్టేషన్ వద్ద తప్పిన ప్రమాదం.. అసలేం జరిగింది..! - narsapur hyderabad express

పెదకూరపాడు రైల్వేస్టేషన్​ దగ్గర పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు రైల్వేట్రాక్​పై పట్టాను పెట్టారు. ఇది గమనించి అధికారులకు సమాచారమివ్వడంతో.. ఆ మార్గంలో వెళ్లాల్సిన రైలును నిలిపివేశారు. లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.

railway
railway

By

Published : May 29, 2022, 9:10 AM IST

Updated : May 29, 2022, 9:24 AM IST

పల్నాడు జిల్లా పెదకూరపాడు రైల్వేస్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి 3 అడుగుల పట్టాను దుండగులు రైల్వేట్రాక్‌పై పెట్టారు. రైలు ఇంజిన్ లోకోపైలట్ దీనిని గమనించి... అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మార్గంలో నడవాల్సిన నర్సాపూర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను కాసేపు అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు, అధికారులు విచారణ చేపట్టారు.

Last Updated : May 29, 2022, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details