ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉయ్యూరు చోరీ కేసును ఛేదించిన పోలీసులు - latest robbery in krishna district

కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన చోరీ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. చోరీ వివరాలను విజయవాడ సీపీ వెల్లడించారు.

uyyuru robbery case
ఉయ్యూరు చోరీ కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Feb 18, 2020, 8:45 PM IST

ఉయ్యూరు చోరీ కేసులో నిందితుల అరెస్టు

కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన చోరీ కేసులో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 10న కాటూరులోని స్థిరాస్తి వ్యాపారి నాగ రజనీకాంత్‌ ఇంట్లో చోరీ జరిగింది. ఆరుగురు వ్యక్తులు ముఖానికి ముసుగులు, చేతులకు తొడుగులు వేసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న రజనీకాంత్‌, అతని భార్యను బండరాయి, గునపాలతో బెదిరించారు. 62 గ్రాముల బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు, ఒక ఐ ఫోన్‌ను దోచుకెళ్లారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన విజయవాడ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. నిందితులకు పాత నేరచరిత్ర ఉందని- వీరిపై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోనూ వివిధ దోపిడీ కేసులు నమోదయ్యాయని చెప్పారు.

ఇవీ చూడండి:

కొడుకులా చూసుకుంటానన్నాడు... మెుత్తం కాజేశాడు

ABOUT THE AUTHOR

...view details