రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో భారీ అవినీతి జరిగిందని.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని తెదేపా డిమాండ్ చేసింది. పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు నిరసన దీక్ష ప్రారంభించారు. వైకాపా నేతల వాటాల్లో తేడాలు రావడం వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా వేశారని ఆయన ఆరోపించారు.
ఇళ్ల స్థలాల పంపిణీని తెదేపా అడ్డుకుందని చెప్పడం హాస్యాస్పదమన్న ఆనంద్‌బాబు.. తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.