ఎన్నికల సంఘం కొరడా - రాష్ట్ర ఎన్నికల సంఘం
ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు దురుద్దేశంగా దరఖాస్తు చేసే వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపిస్తోంది. ఇదివరకే తొమ్మిది జిల్లాల పరిధిలో 45 కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించించిన ఈసీ... తాజాగా కృష్ణా జిల్లాలో 15 కేసులు నమోదుకు ఆదేశించింది.
ఎన్నికల సంఘం కొరడా
కృష్ణా జిల్లా పరిధిలో 3 రోజుల వ్యవధిలో ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులపై 15 కేసులు నమోదయ్యాయి.జగ్గయ్యపేటలో 3, మైలవరం నియోజకవర్గంలో 4, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒకటి చొప్పున అధికారులు కేసులు నమోదు చేశారు. ఓటరు ప్రమేయమే లేకుండా కుట్రపూరితంగా దరఖాస్తులు సమర్పించడాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రనేరంగా పరిగణిస్తోంది. కఠిన చర్యలకు సిద్ధమని ప్రకటించిన ప్రకారం.. పోలీసులు కేసులు నమోదు చేశారు.