ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఆర్థిక నేరగాళ్లను తరిమికొట్టండి: దేవినేని ఉమా - దేవినేని ఉమామహేశ్వరరావు

ఆర్థిక నేరగాళ్లు అరాచకాలు సృష్టించడానికి వస్తున్నారని మంత్రి దేవినేని అన్నారు. మైలవరం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన వైకాపా నేతలకు సరైన గుణపాఠం చెప్పే సమయం దగ్గర పడిందని ఓటర్లకు చెప్పారు.

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

By

Published : Mar 28, 2019, 10:02 PM IST

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని జి.కొండూరు మండలంలో మంత్రి రోడ్​షో చేశారు. ప్రచారంలోదేవినేని మాట్లాడుతూ పసుపు - కుంకుమ చెక్కులను చెల్లవన్న వైకాపా నేతలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మద్యం, డబ్బు పట్టుకొని తిరుగుతున్నారన్న వారికి ఓటుతో సరైన సమాధానం చెప్పాలన్నారు. అభివృద్ధి కొనసాగలంటే తెదేపా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలన్నారు. చంద్రన్న ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ తప్పక నిలబెట్టుకుంటామని దేవినేని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details