హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి హత్యపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా తహసీల్దార్ హత్య దారుణం, దురదృష్టకరమని పేర్కొన్నారు. సమాజంలో రోజురోజుకూ అసహనం పెరిగిపోవటం అవాంఛనీయని అన్నారు. సాంకేతికంగా సమాజం ముందుకు పోతుంటే, మనిషి మాత్రం మానసికంగా ఇలా క్రూరంగా, అనాగరికంగా తయారవటం శోచనీయమంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తహసీల్దార్ విజయ, ఆమెను కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన డ్రైవర్ గురునాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మహిళా తహసీల్దార్ హత్యపై చంద్రబాబు ఆవేదన
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ హత్యపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అసహనం పెరిగిపోవటం అవాంఛనీయమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
చంద్రబాబు