ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ చికిత్సపై పూర్తి వివరాలు సమర్పించండి'

కొవిడ్ చికిత్సపై పూర్తి వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గురువారం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు , సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. మరణించిన వారికి గౌరవ ప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించాలని సూచించింది.

ap high court on corona treatment
ap high court on corona treatment

By

Published : May 4, 2021, 4:20 PM IST

రానున్న రోజుల్లో కొవిడ్ కేసులు పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని... ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆక్సిజన్ అందక రోగులు చనిపోతే పరిస్థితి ఏంటని ధర్మాసనం అడిగింది. కొవిడ్ చికిత్సపై సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆక్సిజన్, పడకలు, ఔషదాలు, కొవిడ్ పరీక్షల ఫలితాలు, వాక్సినేషన్ వంటి పలు కీలకాంశాలపై గంటన్నరకు పైగా విచారణ జరిపింది.

అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ ను హైకోర్టు నియమించింది. మరణించిన వారికి గౌరవ ప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించాలని సూచించింది. కొవిడ్ చికిత్సపై పూర్తి వివరాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గురువారం లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details